
- బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి
గోదావరిఖని, వెలుగు: తనను గెలిపిస్తే ప్రతి మండలంలోని ఓ హైస్కూల్‌ను ఎంపిక చేసుకుని దాని అభివృద్ధికి తన శాలరీ నుంచి రూ.2.50 లక్షలు కేటాయిస్తానని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం సాయంత్రం బీజేపీ లీగల్సెల్ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని బార్అసోసియేషన్ఆఫీస్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ప్రతి అడ్వకేట్‌కు నోటరీగా అవకాశం కల్పించేలా ప్రయత్నం చేస్తానన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ లీగల్సెల్స్టేట్ఎగ్జిక్యూటివ్ మెంబర్ బల్మూరి అమరేందర్‌రావు, లీడర్లు చంద్రశేఖర్, సంజయ్ కుమార్, సోమారపు లావణ్య, బల్మూరి వనిత, కందుల సంధ్యారాణి, సోమారపు అరుణ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. కాగా సాంకేతిక సమస్యతో ఎమ్మెల్సీ బరి నుంచి తప్పుకున్న తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ పోకల నాగయ్య బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు.