
ఈ నెల రెండో వారంలో రిజల్ట్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెండ్రోజుల పాటు జరిగిన ఎంసెట్ అగ్రికల్చర్ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 94,476 మంది అప్లై చేయగా, 80,575(85%) మంది హాజరయ్యారని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. శనివారం 84.5% మంది హాజరుకాగా, ఆదివారం 86.1% మంది పరీక్ష రాశారని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష పూర్తయింది. ఈ నెల రెండో వారంలో ఫలితాలు రిలీజ్ చేసే అవకాశం ఉంది.
ఇవ్వాల ఈసెట్
రాష్ట్రంలోని బీటెక్, బీఫార్మసీ తదితర కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ కోసం నిర్వహించే టీఎస్ఈసెట్ ఎగ్జామ్ సోమవారం జరగనున్నది. పరీక్షకు మొత్తం 24,055 మంది హాజరవుతారని భావిస్తున్నట్లు ఈసెట్ కన్వీనర్ విజయ్ కుమార్ తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్ష ఉంటుందని చెప్పారు. కొత్త హాల్ టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.