ఏపీలో ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల

ఏపీలో ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఆగస్టు 19 నుంచి 25 వరకు ఎంసెట్ నిర్వహించనున్నారు. ఏపీలో ఎంసెట్‌ను ఎప్ సెట్‌గా మార్చారు. ఎప్ సెట్ అంటే ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్, ఫార్మా కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ అని అర్థం. ఈనెల 24న నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేయనుంది. జూన్ 26 నుంచి జూలై 25 వ‌ర‌కు ఆన్‌లైన్‌‌లో అప్లికేష‌న్లను స్వీకరించనున్నారు. జూలై 26 నుంచి ఆగ‌స్టు 5 వ‌ర‌కు రూ.500 లేట్ ఫీజు, ఆగ‌ష్టు 6 నుంచి 10 వ‌ర‌కు రూ.1,000, ఆగ‌స్టు 11 నుంచి 15 వ‌రకు రూ.5 వేల లేట్ ఫీజుతో అప్లికేష‌న్లను స్వీకరించనున్నారు. ఆగ‌స్టు 16 నుంచి 18 వ‌రకు రూ.10 వేల లేట్ ఫీజుతో అప్లికేష‌న్లను తీసుకోనున్నారు. ఈసెట్, ఐసెట్, పీజీ సెట్, లాసెట్, ఎడ్ సెట్, పీసెట్‌‌తోపాటు మిగిలిన ఎంట్రన్స్ టెస్ట్‌‌ల‌ను సెప్టెంబ‌ర్ మొద‌టి వారం లేదా రెండో వారంలో నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిందని తెలుస్తోంది.