రెనివట్ల జడ్పీ స్కూల్లో ముందస్తు రక్షాబంధన్

రెనివట్ల జడ్పీ స్కూల్లో ముందస్తు రక్షాబంధన్

మద్దూరు, వెలుగు: రెనివట్ల జడ్పీ హైస్కూల్ లో గురువారం ముందస్తు రక్షాబంధన్​నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు తమ తోటి విద్యార్థులకు రాఖీలు కట్టారు. హెచ్ఎం రాజునాయక్ మాట్లాడుతూ.. ఆపదలో తోబుట్టువులకు అండగా నిలవాలని సూచించారు. కార్యక్రమంలో టీచర్లు పాల్గొన్నారు.