ఆదిలాబాద్  జిల్లా పాఠశాలల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు

ఆదిలాబాద్  జిల్లా పాఠశాలల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు

బెల్లంపల్లి, వెలుగు : పట్టణంలోని పలు పాఠశాలల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు   ఉత్సాహంగా నిర్వహించారు. జనవరి 19 వరకు సంక్రాంతి సెలవులు ఉండడంతో.. శుక్రవారం పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ప్రత్యేక ఫెస్టివల్ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పండుగ   విశిష్టతను వివరించారు. అంతేకాకుండా కైట్ పోటీలు, రంగవల్లుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. పాఠశాల డైరెక్టర్ ఈ. రవి ప్రసాద్, ప్రిన్సిపాల్ ఎం. రాజా రమేష్, టీచర్లు, విద్యార్థులు  పాల్గొన్నారు.