నేషనల్ హైవేలపై జర్నీ చేసే వారికి గుడ్ న్యూస్ . క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్' పేరుతో తీసుకొచ్చినట్టు ఈ పథకంను జూన్ 30వరకు పొడిగిస్తున్నట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా తన ఎక్స్ లో ప్రకటించింది. ప్రయాణికుల పరిశుభ్రత, వారి సౌకర్యం కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) ఈ స్కీమ్ ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.. ఈ స్కీంతో జాతీయ రహదారిపై ప్రయాణించే ప్రజలు రాజ్‌మార్గయాత్ర యాప్ ద్వారా మురికిగా ఉన్న టోల్ ప్లాజా టాయిలెట్ల ఫోటో తీసి యాప్ లో అప్లోడ్ చేస్తే చాలు వారి ఫాస్ట్‌ట్యాగ్ వాలెట్లో ఉచితంగా రూ. 1,000 రీచార్జ్ లభిస్తోంది. ఈ స్కీం 2026 జూన్ 30 వరకు మాత్రమే ఈ పథకం కొనసాగుతుంది.
రీచార్జ్ ఎలా పొందాలి.?
- ఫ్రీగా రీచార్జ్ పొందాలంంటే మీ ఫోన్ లో రాజ్ మార్గయాత్ర యాప్ లేటెస్ట్ వెర్షన్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
- నేషనల్ హైవేల వెంట మీరు పంపించే టాయిలెట్ ఫోటో, టైమింగ్ ను యాప్ లో అప్ లోడ్ చేయాలి
- ఫోటో అప్ లోడ్ చేసి వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నంబర్ పూర్తి వివరాలు తెలియజేయాలి
- మీరు పంపించిన ఫోటో నిజమా ? కాదా అని స్థానిక అధికారులు ధృవీకరిస్తారు.
- అర్హత కల్గితే వెహికల్ రిజిస్ట్రేషన్ ఫాస్టాగ్ నంబర్ కు రీచార్జ్ రూపంలో రూ.1000 లభిస్తుంది.
- ఈ డబ్బును నగదు రూపంలో విత్ డ్రా చేసుకోలేదరు, ఫాస్టాగ్ అకౌంట్ కు మాత్రమే యాడ్ అవుతుంది.
- ఈ పథకం NHAI నిర్వహించే టాయిలెట్లకు మాత్రమే వర్తిస్తుంది. పెట్రోల్ పంపులు,దాబాలు,రెస్టారెంట్లలోని టాయిలెట్లకు వర్తించదు.
ప్రతీ టాయిలెట్ కు రోజుకు ఒకసారి మాత్రమే బహుమతి వస్తుంది. ఒకే రోజు ఒక టాయిలెట్ ను చాలా మంది ఫోటో తీసి పంపిస్తే..ముందుగా ఫోటోను పంపించిన వారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఒక వేళ ఏఐ ఫోటోలు కానీ..గతంలో తీసిన ఫోటోలు పంపించినా నకిలీ ఫోటోలు అని తేలినా తిరస్కరిస్తారు.
►ALSO READ | పార్టీ ఫండ్ అంటే బీజేపీకే ఇస్తున్నారు.. 365 రోజుల్లో.. రూ.3 వేల 826 కోట్లు.. 82 శాతం వీళ్లదే..!
2025 సెప్టెంబర్ లో ప్రారంభించిన ఈ పథకాన్ని జూన్ 30 వరకు పొడిగించింది . ఈ స్కీంతో దాదాపు 350 మంది ప్రయాణికులు అపరిశుభ్రమైన టాయిలెట్లపై ఫిర్యాదు చేశారు. వీటిలో అర్హులైన 265 మందికి ఫాస్టాగ్ రీచార్జ్ రూ. 1000లభించింది.
Report & Get Rewarded!
— NHAI (@NHAI_Official) February 12, 2026
To enhance commuter convenience and hygiene standards across National Highways, NHAI is conducting the ‘Clean Toilet Picture Challenge’ till 30th June 2026. The initiative encourages National Highway users to report any unclean toilet facilities at Toll… pic.twitter.com/fu3cmstoSZ
