నేపాల్ లో భూకంపం

నేపాల్  లో భూకంపం

ఖాట్మండ్: నేపాల్ మరోసారి ఉలిక్కిపడింది. రాజధాని ఖాట్మండ్ కు సమీపంలో ఈ రోజు తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగలు తీశారు. రాజధాని ఖాట్మండ్ కు తూర్పు,ఈశాన్యం దిశగా 166 కిలోమటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రెక్టార్ స్కేల్ పై 4.3 తీవ్రతతో భూమి కంపించినట్లు అక్కడి సైంటిస్టులు తెలిపారు. కాగా.. 2015లో నేపాల్ లో  రెక్టార్ స్కేల్ పై 7.8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ఆ సమయంలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించాయి. దాదాపు 9 వేల మంది మరణించారు. తాజాగా మరోసారి భూకంపం సంభవించడంతో ఉలిక్కిపడింది నేపాల్. కానీ ఈ సారి పెద్దగా ఆస్థి, ప్రాణ నష్టం జరుగలేదని అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తల కోసం 

కేటీఆర్ రాజీనామా వ్యాఖ్యలపై షర్మిల కౌంటర్

మెస్‌లో కాల్పులు.. ఐదుగురు బీఎస్ఎఫ్ జవాన్ల మృతి