
సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండలంలో భూప్రకంపనలు వచ్చాయి. న్యాల్ కల్ , ముంగి గ్రామాల్లో స్వల్పంగా భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
భూ ప్రకంపనలు వచ్చే సమయంలో వింత శబ్దాలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. కాసేపు ఏం జరుగుతోందనని టెన్షన్ పడ్డారు. అయితే ఈ భూ ప్రకంపనాల కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లలేదు. ఈ భూప్రకంపనలపై అధికారులు ఆయా గ్రామాల్లో ఆరాదీస్తున్నారు.