చైనాలో గట్టిగానే వచ్చిన భూకంపం : కుప్పకూలిన ఇల్లు, ఆఫీసులు

చైనాలో గట్టిగానే వచ్చిన భూకంపం : కుప్పకూలిన ఇల్లు, ఆఫీసులు

చైనా దేశంలో భూకంపం గట్టిగానే వచ్చింది. ఏ విషయాన్ని ప్రపంచానికి నిజం చెప్పని చైనా.. భూకంపం విషయంలోనూ సరైన వివరాలు వెల్లడించలేదు. గన్సూ ప్రావిన్స్ ప్రాంతంలో అర్థరాత్రి సమయంలో వచ్చిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.2గా నమోదైంది.. మొదట 5.4గా చెప్పిన చైనా.. ఆ తర్వాత 6.2గా స్పష్టం చేసింది. ఈ భూకంపం ధాటికి చాలా భవనాలు కూలిపోయాయి.. బిల్డింగ్స్ ఊగిపోయాయి.. చాలా ప్రాంతాల్లో ఇల్లు నేల మట్టం అయ్యాయి.. అర్థరాత్రి సమయం కావటంతో.. నిద్రలో ఉన్న వారు.. శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. ఇప్పుడిప్పుడే సహాయ చర్యలు ఊపందుకున్నాయి. శిథిలాలు తొలగించే కొద్దీ.. మృతుల సంఖ్య పెరుగుతుందని స్థానిక మీడియాతోపాటు.. సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

భూకంపం ధాటికి గన్సూ ప్రాంతంలో.. చాలా భవనాలు కూలిపోయాయి. ఇప్పటి వరకు 116 మంది చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించినా.. 250 మంది వరకు గాయపడినట్లు వెల్లడించింది. శిథిలాల తొలగింపు వేగవంతం అయిన తర్వాత.. మృతుల సంఖ్య భారీగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 

చైనాలో వచ్చిన భూకంపం తీవ్రత ఎలా ఉంది అనటానికి.. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ వీడియోనే సాక్ష్యం.. రెస్టారెంట్ ఫుడ్ తింటున్న కస్టమర్లు.. భూకంపానికి బిల్డింగ్ ఊగిపోవటంతో.. ఒక్కసారిగా అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. బిల్డింగ్ 20 సెకన్లు ఊగటం వీడియోలో స్పష్టంగా కనిపించింది. చిన్న భూకంపం అయితే ఏడు నుంచి 12 సెకన్ల మధ్యే తీవ్ర ప్రకంపనలు ఉంటాయని.. 20 సెకన్లపైనే బిల్డింగ్ ఊగుతూ.. వీడియోలో కనిపించిందని.. అంటే భూకంప తీవ్రత చాలా ఎక్కవగా ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు..