Afghanistan Earthquake : ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి భూకంపం

Afghanistan Earthquake : ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి భూకంపం

ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.4 తీవ్రత నమోదైంది. భూకంపాన్ని గుర్తించిన వెంటనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. దీంతో ఇప్పటి వరకు ఎలాంటి నష్టం జరగలేదు ఈ నెలలో ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం రావడం ఇది రెండోసారి.  నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్‌లో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం 69.51 రేఖాంశం, 136 కి.మీ లోతులో 34.53 అక్షాంశం వద్ద సంభవించింది. అంతకుముందు మార్చి 2న ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్ ప్రాంతంలో మధ్యాహ్నం 2:35 గంటలకు IST 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. రెండు భూకంపాలలోనూ ఎలాంటి నష్టం జరగలేదు. 

టర్కీ, సిరియాలో భూకంపం

ఫిబ్రవరి 6న టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపంలో 52,000 మందికి పైగా మరణించారు. ఒక్క టర్కీలోనే ఇప్పటివరకు 45,000 మందికి పైగా మరణించారు. నిజానికి, టర్కీ, సిరియాలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. భవిష్యత్తులో ఇక్కడ మరిన్ని భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉండటంతో సహాయక బృందాలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు వస్తున్నాయి.