Health Tips: చలికాలం వచ్చేసింది... ఇకపై ఈ ఆహారం తింటే ఆరోగ్యానికి మేలు..

Health Tips: చలికాలం వచ్చేసింది...  ఇకపై ఈ ఆహారం తింటే ఆరోగ్యానికి మేలు..

చలికాలం వచ్చేసింది.  శీతగాలులు జనాలను ఉక్కిరి బిక్కిరి చేస్తు్న్నాయి.   ఓ పక్క వైరల్ ఫీవర్.. మరో పక్క జలుబు, దగ్గు  శ్వాశకోస ఇబ్బందులతో జనాలు అవస్థలు పడుతున్నారు.  అయితే శీతాకాలంలో కొన్ని పదార్ధాలను ఇలాంటి వాటికి చెక్ పెట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంపొందించటంలో కొన్ని రకాల ఆహారాలు ఎంతగానో సహాయపడతాయి. చలికాలంలో జలుబు,దగ్గు వంటివి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. చల్లని వాతావరణంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకునే ప్రయత్నం చేయటం ద్వారా కొంతమేర ఈ వ్యాధులను దరిచేరకుండా చూసుకోవచ్చు. శరీరానికి వెచ్చదనాన్ని కలిగించే టీ, కాఫీ, హాట్ చాక్లెట్, సూప్ వంటి వేడి పదార్థాలను తినేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు.

చలికాలంలో తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు 

నెయ్యి :  చలికాలంలో నెయ్యి తీసుకోవటం ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది. నెయ్యితో రోగనిరోధకశక్తి బాగా పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలను దరిచేరనివ్వదు. ప్రతిరోజూ ఉదయాన్నే గ్లాస్ గోరువెచ్చని పాలలో 3 స్పూన్ల నెయ్యిని కలుపుకుని తీసుకోవటం ద్వారా శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు. నీరసంగా, అలసట వంటి వాటి నుండి బయటపడవచ్చు. వేడివేడి అన్నంలో దీనిని వేసుకుని తినవచ్చు. అలాగని అధిక మోతాదులో దీనిని తీసుకోరాదు.

బెల్లం : చలినుండి శరీరానికి వెచ్చదనం కావాలంటే బెల్లం తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బెల్లంలో అనేక పోషకాలు ఉంటాయి. ప్రధానంగా ఐరన్ సంవృద్ధిగా ఉంటుంది. రక్తహీనతను తొలగించటంతోపాటు జీర్ణక్రియను మెరుగుపరుచటంలో సహాయపడుతుంది. సాధారణంగా చలికాలంలో జీవక్రియలు మందకొడిగా ఉంటాయి. వాటిని వేగవంతం చేయటం లో సహాయపడుతుంది. రోగనిరోధక వ్యవస్థను బలపరిచి జలుబు, దగ్గు సమస్యలు దరిచేరకుండా చేస్తుంది. బెల్లం రోజూ కొద్ది మొత్తంలో తీసుకోవటం వల్ల కాలేయం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

సిట్రస్ పండ్లు : ఆరెంజ్, యాపిల్, దానిమ్మ, కివి, బొప్పాయి, జామ మొదలైన పండ్లను తీసుకోవటం చాలా మంచిది. శీతాకాలంలో ఈ పండ్లు మార్కెట్లో విరివిగా లభిస్తాయి. వీటిని తినటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలగటంతోపాటుగా రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. సిట్రస్ జాతికి చెందిన పండ్లు చల్లని వాతావరణంలో జలుబు, దగ్గు వంటి వాటి నుండి రక్షణగా పనిచేస్తాయి. శరీర ఉష్ణోగ్రతను నిలకడగా ఉంచుతాయి.

తేనె : చలికాలంలో తేనె తీసుకోవటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు ఆయుర్వేదం చెబుతుంది. ఇది ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి చలికాలంలో దీనిని తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు ఆయుర్వేద నిపుణులు. జలుబు, దగ్గు చికిత్సకు తేనెను వందల సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు.   తేనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఊపిరితిత్తులు, ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. వేడి నీటిలో తేనెను కలిపి తీసుకోవటం ద్వారా ఆరోగ్యానికి హాని కలిగించే టాక్సిన్స్ ను బయటకు పంపవచ్చు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, గొంతు నొప్పి , దగ్గు వంటి సమస్యల నుండి ఉపశమనం పొందాలంటే నిమ్మకాయనీటిలో తేనె కలుపుకుని తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

అల్లం :  చలికాలంలో అల్లం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో యాంటి బ్యాక్టిరియల్ గుణాలు ఉన్నాయి. జలుబు, దగ్గు వంటి ఇన్షెక్షన్ల నుండి రక్షించటంలో సహాయపడుతుంది. రక్తప్రసరణను మెరుగుపరిచి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కొలెస్ట్రాల్ పెరగటాన్ని నిరోధిస్తుంది.

గుమ్మడి, సొర కాయలు :  మనం పెద్దగా ఇష్టపడని ఆహారాల్లో గుమ్మడి, సొరకాయలు ఒకటి. అయితే, వీటిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు మరెందులోనూ ఉండవు. వారంలో కనీసం రెండు సార్లు వీటిలో ఒకదాన్ని ఆహారంగా తీసుకోండి. కప్పు గుమ్మడి కూరలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. విటమిన్-A, విటమిన్-C, విటమిన్-B6, విటమిన్-K పుష్కలంగా ఉంటాయి. ఫోలిక్ యాసిడ్, పొటాషియం వంటివి శరీరానికి అందుతాయి. దీనివల్ల శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.
 
 బంగాళాదుంపలు: సీజన్లోనైనా వీటిని తీసుకోవచ్చు. ముఖ్యంగా చలికాలంలో వీటిని తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఆలు గడ్డల్లో విటమిన్-C, B6 పుష్కలంగా ఉంటాయి. ఒక మీడియం సైజు బంగాళ దుంపలో 4 గ్రాముల ఫైబర్ ఉంటుంది. పురుషులు రోజుకు 38 గ్రాములు, స్త్రీలకు 25 గ్రాముల ఫైబర్ అవసరమవుతాయి. చలికాలంలో వచ్చే జీర్ణ సమస్యల పరిష్కారానికి బంగాళాదుంపలు మంచివి.

ఆకుకూరలు : చలికాలంలో ఆకు కూరలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని రోజూ తీసుకుంటే శరీరానికి కావాల్సిన విటమిన్-A, C, K అందుతాయి. ఆకు కూరల్లో ఫోలిక్ ఆమ్లం కూడా ఎక్కువే. మహిళలు వీటిని తినడం చాలా మంచిది.

Also Read: కామారెడ్డిలో కేసీఆర్ పై వెయ్యి మంది పోటీ చేయబోతున్నారా..!

శీతాకాలంలో శ్వాసకోశ వైరల్ ఇన్ఫెక్షన్లు అందరిని ఇబ్బంది పెడతాయి. అలాంటప్పుడు తీవ్రమైన వైరల్ ఇన్‌ఫెక్షన్‌లకు వ్యతిరేకంగా ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థను కలిగి ఉండటం ఉత్తమం. ధూమపానం మానేయడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించడం, పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు తినడం వంటి జీవనశైలిలో కొన్ని చిన్న మార్పులు చేయడం ద్వారా రోగనిరోధక వ్యవస్థను పెంచుకోవచ్చు.