జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంత ఖర్చు చేసిందో నాకు తెలుసు

V6 Velugu Posted on Nov 25, 2021

షామీర్ పేట: కేసీఆర్ ను ఢీకొట్టే పార్టీ బీజేపీ మాత్రమేనని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆ పరిస్థితుల్లో లేదని ఆయన అన్నారు. శామీర్ పేటలోని తన నివాసంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన బీజేపీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడారు.

‘కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించినా.. వారు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిపోతారనే ఓ భావన  ప్రజల్లో ఏర్పడింది. కేసీఆర్ ప్రలోభాలతో లొంగదీసుకొని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారు. ప్రలోభాలకు లొంగనిది బీజేపీ మాత్రమే. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించి.. బీజేపీ జెండాను తెలంగాణ రాష్ట్రంలో ఎగురవేయాలనే సంకల్పం ప్రతి కార్యకర్త తీసుకోవాలి. డబ్బుతోనే ప్రజలను తమవైపు తిప్పుకుంటామనుకుంటే అది పొరపాటే. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  టీఆర్ఎస్ పార్టీ ఎంత డబ్బు ఖర్చు చేసిందో నాకు తెలుసు. ఎన్నికల్లో ఎంత డబ్బు ఖర్చు చేసినా.. సందర్భం వచ్చినప్పుడు ధర్మాన్ని కాపాడేది ప్రజలే’ అని ఈటల అన్నారు.

Tagged Bjp, TRS, Congress, CM KCR, GHMC elections, Eatala Rajender

Latest Videos

Subscribe Now

More News