సింగరేణిలో అవినీతిపై 2014 నుంచి విచారణ జరపాలి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎంపీ చామల లేఖ

సింగరేణిలో అవినీతిపై 2014 నుంచి విచారణ జరపాలి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎంపీ చామల లేఖ

న్యూఢిల్లీ, వెలుగు: సింగరేణిలో 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని టెండర్లపై  విచారణ జరిపించాల ని కేంద్ర  మంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌ రెడ్డిని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. నైనీ కోల్ బ్లాక్ విషయంలో తలెత్తిన వివాదంపై వెంటనే స్పందించి, ఇద్దరు సభ్యులతో ఎంక్వైరీ టీం వేయడంపై కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయనకు లేఖ రాశారు. 

కేవలం నైనీ కోల్ బ్లాక్ టెండర్ రద్దు అంశానికే ఈ విచారణను పరిమితం చేయొద్దని, సింగరేణిలో  పదేండ్ల కాలంలో జరిగిన అన్ని టెండర్లు, అధికారిక ప్రక్రియలపై విచారణ జరిపించాలని లేఖలో కోరారు. అలాగే, ప్రస్తుతం కొనసాగు తున్న టెండర్ ప్రక్రియను కూడా ఈ విచారణ పరిధిలోకి తీసుకురావాలని అందులో విజ్ఞప్తి చేశారు. టెండర్ల కేటాయింపుల్లో ఏవైనా అవకతవకలు జరిగి ఉంటే, వాటిని ప్రజలకు తెలియజేయాలన్నారు.