అసెంబ్లీలో కనిపించే ముఖం నాదే, కేసీఆర్‎ది కాదు

అసెంబ్లీలో కనిపించే ముఖం నాదే, కేసీఆర్‎ది కాదు

సీఎం పదవి ఆయన తాత నుంచో, తండ్రి నుంచో వారసత్వంగా రాలేదని కేసీఆర్ గుర్తుంచుకోవాలని ఈటల రాజేందర్ అన్నారు. ప్రజల ఓట్లతోనే ఆ పదవి వచ్చిందని ఆయన తెలుసుకోవాలన్నారు. యావత్ తెలంగాణ ప్రజలు హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం ఎదురుచూస్తున్నారన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక సందర్భంగా ఆయన భూజునురులో మాట్లాడారు. 

‘ఉద్యమ సమయంలో నువ్వు ఏది మాట్లాడినా చెల్లింది. నువ్వు గెలిచాక మొదటి నాలుగున్నర సంవత్సరాలు ఏది చేసినా చెల్లింది. కానీ ఇప్పుడు నిన్ను ప్రజలు తెలంగాణ ద్రోహి అంటున్నారు. ఈటల రాజేందర్‎ను హుజూరాబాద్ ఏంచేయబోతుందా అని తెలంగాణ మొత్తం ఎదురుచూస్తోంది. పత్రికలకు, సర్వేలకు అంచనా దొరకని విధంగా హుజూరాబాద్ ప్రజలు బీజేపీని గెలిపించబోతున్నారు. రూపాయి ఖర్చుపెట్టకున్నా కూడా నన్ను ఆరుసార్లు గెలిపించారు. నేను వారి సంపాదనలో వాటా అడగలేదు. మంత్రిగా గుర్తించకపోయినా.. కనీసం మనిషిగా గుర్తించాలన్నాను. ప్రజలకు ఆపిన పతకాలను ఇవ్వాలని కోరడం తప్పా? ప్రజల కోసం మంత్రి పదవి వదులుకోవడానికి సిద్దం అయిన వాడిని నేను. దళితబంధుకు కారణం హుజూరాబాద్ ఉప ఎన్నిక. ఈ పథకానికి 2 లక్షల కోట్లు అవుతాయి. రాజు తలుచుకుంటే దెబ్బలు కొదువనా.. దళితబంధు ఎంత ఖర్చయినా అందరికీ ఇస్తాం అని కేసీఆర్ చెప్పారు. అంతపెద్ద మొత్తం బడ్జెట్ లో లేకుండా ప్రకటించడం తప్పు కాదా. ఖజానాలో డబ్బుల్లేక.. కోకాపేట భూములమ్మి దళితబంధు ఇస్తానన్నప్పుడు స్వాగతించిన మొదటి వ్యక్తిని నేను. అలాంటిది నా మీద దొంగ ఉత్తరం పుట్టించారు. అది తప్పుడు లేఖ అని ఎన్నికల కమిషన్ చెప్పింది కదా. దళితబంధు ఆపాలని నేను లేఖ రాయలేదని పోచమ్మ గుడికి వస్తా.. కేసీఆర్ నువ్వు వస్తావా? దళితబంధు తెలంగాణ అంతా అమలు చేయించడమే నా మొదటి యుద్ధం. ఈ నెల 30వ తేదీ తరువాత అదే పని నాకు. బీజేపీ కార్యకర్తలతో నా భార్య దాడి చేయించుకొని.. ఏడుస్తూ ఓట్లు అడుగుతుందని అంటున్నారు. అలా అనే వాళ్లకు భార్యలు లేరా, తల్లులు లేరా, ఆడబిడ్డలు లేరా? అలాంటివాళ్లందరి భరతం పడతా. తెలంగాణలో 2023లో  ఎగిరెది కాషాయ జెండానే. నువ్వు మోకాళ్ల మీద నడిచినా, మోచేతుల మీద నడిచినా.. ప్రజలు నిన్ను నమ్మరు. ఈ నెల 30వ తరువాత అసెంబ్లీలో కనిపించే ముఖం నాదే, కేసీఆర్‎ది కాదు. డబ్బిస్తే తీసుకోండి.. కానీ ధర్మాన్ని వదులుకోకండి. నేను గెలిస్తే ప్రజల గౌరవం నిలబడుతుంది, దళితబంధు అమలవుతుంది, పెన్షన్లు వస్తాయి, ఐకేపీ సెంటర్లు ఉంటాయి, వడ్లు కొంటాయి’ అని ఈటల అన్నారు.

For More News..

కేసీఆర్ మాట మీద నిలబడే వ్యక్తి కాదు, మడమ తిప్పే వ్యక్తి

హైదర్‎గూడలో మిస్సైన బాలుడు.. శవమై తేలిండు

25 రోజుల్లో 18సార్లు పెరిగిన పెట్రోల్ ధర..

మేడ్ ఇన్ ఇండియా వస్తువుల కొనుగోలుపై శ్రద్ధ పెట్టాలి