కేసీఆర్ మాట మీద నిలబడే వ్యక్తి కాదు, మడమ తిప్పే వ్యక్తి

కేసీఆర్ మాట మీద నిలబడే వ్యక్తి కాదు, మడమ తిప్పే వ్యక్తి
  • దళితబంధుకు ఈటల రాజేందర్ పేరుపెట్టాలి

ఈటల లేకపోతే దళితబంధు వచ్చేది కాదని.. దళితబంధు పతకానికి ఈటల రాజేందర్ దళితబంధు అని పేరు పెట్టాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని బూజునూర్‎లో ఈటల రాజేందర్ తరఫున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడారు.

ప్రజలను మభ్యపెట్టడమే కేసీఆర్ లక్ష్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఇలా అన్నీ అబద్దాలు చెప్పి మోసం చేయడం కేసీఆర్ అలవాటయిందని ఆయన అన్నారు. దళిలబంధును ఎలక్షన్ కమిషన్ హుజూరాబాద్‎లో మాత్రమే ఆపిందని ఆయన అన్నారు.‎ దళితబంధు పతకం రావడానికి కారణం కేసీఆర్ కాదని.. దానికి కారణం ఈటల రాజేందర్ అని ఆయన అన్నారు. 

‘ఈటల లేకపోతే దళితబంధు వచ్చేది కాదు. అసలు దళితబంధు పతకానికి ఈటల రాజేందర్ దళితబంధు అని పేరు పెట్టాలి. హుజూరాబాద్ ఎన్నిక అయిపోగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళితులందరికీ దళితబంధు ఇవ్వాలి. ఒకేరోజు సకల జనుల సర్వే చేసినట్లుగానే.. ఒకేరోజు దళితబంధు కూడా ఇవ్వాలి. కేసీఆర్ అలా ఇచ్చే వ్యక్తి కాదు. కేసీఆర్ మాట మీద నిలబడే వ్యక్తి కాదు, మడమ తిప్పే వ్యక్తి. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర తెలంగాణ ప్రజలకుంది. అలాగే కేసీఆర్ కుటుంబపాలనకు వ్యతిరేకంగా కూడా పోరాటం చేస్తారు. ఈ పోరాటంలో భాగంగా హుజూరాబాద్ ప్రజలు.. న్యాయం, ధర్మం పక్కన నిలబడి ఈటలను భారీ మెజార్టీతో గెలిపించాలి. సీఎం సీటును ఎడమకాలి చెప్పుతో పోల్చిన కేసీఆర్‎కు.. ప్రజల ఓట్లు అడిగే హక్కు లేదు. ‎తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోంది. ఆ అవినీతికి చరమగీతం పాడాల్సిన సమయమొచ్చింది. కేసీఆర్ కుటుంబపాలనకు చరమగీతం పాడటానికి హుజూరాబాద్ ప్రజలు మొదటి అడుగు వేయాలి.  నియంతృత్వ పాలనకు 
వ్యతిరేకంగా ఓటెయ్యడం మీ అదృష్టం. ఆత్మగౌరవానికి అనుకూలంగా ఓటెయ్యడం మీ అదృష్టం. అందుకోసం మీరందరూ ఈటల రాజేందర్‎కు ఓటు వేసి గెలిపించాలి’ అని కిషన్ రెడ్డి అన్నారు.

For More News..

హైదర్‎గూడలో మిస్సైన బాలుడు.. శవమై తేలిండు

25 రోజుల్లో 18సార్లు పెరిగిన పెట్రోల్ ధర..

మేడ్ ఇన్ ఇండియా వస్తువుల కొనుగోలుపై శ్రద్ధ పెట్టాలి