
రాజేంద్రనగర్ హైదర్‌గూడ న్యూ ఫ్రెండ్స్ కాలనీలో గురువారం కనిపించకుండా పోయిన ఏడేళ్ల అన్వేష్ శవమై కనిపించాడు. అన్వేష్ కుటుంబం ఉంటున్న కొండల్ రెడ్డి అపార్ట్ మెంట్ వెనక ఉన్న చెరువులో అన్వేష్ మృతదేహం లభ్యమైంది. గురువారం మధ్యాహ్నం నుంచి అన్వేష్ కనిపించడంలేదు. వెంటనే తల్లిదండ్రులు శివశంకర్, అపర్ణలు రాజేంద్ర నగర్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేశారు. మొదట అన్వేష్ కిడ్నాప్‌కు గురైనట్లు భావించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. 10 బృందాలుగా ఏర్పడి అన్వేష్ కోసం గాలింపు చేపట్టాయి. కాగా.. శుక్రవారం ఉదయం చెరువులో మృతదేహం కనిపించడంతో పోలీసులకు స్థానికులు సమాచారమిచ్చారు. చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు.. అన్వేష్ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు.
For More News..