
ఏ చిన్న పార్టీ జరిగినా చికెన్ ముక్క లేనిదే ముద్ద దిగదనేవాళ్లు ఎంతో మంది ఉంటారు. కానీ దాంతో జర జాగ్రత్త. ఎందుకంటే చికెన్ తింటే కేన్సర్ వస్తుంది మరి. ఏంటీ నమ్మబుద్ది కావట్లేదా? బ్రిటన్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు స్టడీ చేసి మరీ చెబుతున్న మాట ఇది. మటన్ ధర ఎక్కువ కాబట్టి దానికి బదులుగా ఎక్కువ మంది చికెన్ తింటారు. కానీ కోళ్లు తొందరగా పెరగటానికి పౌల్ట్రీల్లో మందులు ఎక్కువ వాడుతుంటారు. అలాంటి చికెన్ తింటే పోషకాల మాట అటుంచితే ఆరోగ్యానికే నష్టమంటున్నారు సైంటిస్టులు. 4.75 లక్షల మందిపై ఎనిమిదేళ్ల పాటు స్టడీ చేసిన సైంటిస్టులు చికెన్ తింటే కేన్సర్ వస్తుందని నిర్ధారించారు. వారి డైట్‌ను, వారికి వస్తున్న వ్యాధుల్ని పరిశీలించారు. అందులో 23,000 మందికి రక్త , ప్రొస్టెట్ కేన్సర్ ఎక్కవగా వచ్చినట్లు గుర్తించారు. చికెన్ తినటం వల్ల కేన్సర్ వస్తోందనిచెప్పిన సైంటిస్టులు వాటికి కారణాలు మాత్రం చెప్పలేదు. మటన్ తింటే ఆరోగ్యానికి మంచిది కాదనీ, బ్రెస్ట్, ప్రొస్టెట్ కేన్సర్ వస్తోందని, దానికి బదులుగా చికెన్ తింటున్నారని, ఇప్పుడు చికెన్ తిన్నా కేన్సర్ వస్తోందని చెప్పారు.