గ్రీన్కార్డ్కు ఈబీ-5 వీసా బెస్ట్

గ్రీన్కార్డ్కు ఈబీ-5 వీసా బెస్ట్

హైదరాబాద్​, వెలుగు: ఇమిగ్రేషన్​ నిబంధనలపై గందరగోళం ఉన్నప్పటికీ, అమెరికా ఈబీ-5 ఇన్వెస్టర్​ వీసాతో గ్రీన్​ కార్డ్‌‌‌‌‌‌‌‌ను త్వరగా పొందవచ్చని ఎక్స్​పర్టులు తెలిపారు. న్యూయార్క్​కు చెందిన న్యూయార్క్​ఇమిగ్రేషన్​ ఫండ్​ ఆధ్వర్యంలో హైదరాబాద్​లో ఎఫ్‌‌‌‌‌‌‌‌టీసీసీఐలో జరిగిన ఈబీ-5 ఓవర్​వ్యూలో ఇమిగ్రేషన్​ అటార్నీ ఇల్యా ఫిష్కిన్​ మాట్లాడుతూ, ఇతర కేటగిరీల్లో భారతీయులకు చాలా బ్యాక్‌‌‌‌‌‌‌‌లాగ్‌‌‌‌‌‌‌‌లు ఉన్నందున, ఈబీ-5 ఉత్తమ మార్గమని ఆయన అన్నారు. 

ఇది స్వయంగా స్పాన్సర్​ చేసుకునే వీసా అని, దీనికి యజమాని, స్పాన్సర్​ అవసరం లేదని వివరించారు. అందుకే భారతీయులు ఈ పథకంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు. దరఖాస్తుకు ముందు  పెట్టుబడిదారులు ప్రాజెక్టులను జాగ్రత్తగా అంచనా వేయాలని ఆయన సూచించారు.