ర్యాలీలు, ఊరేగింపులకు నో చాన్స్.. ఎన్నికల ఫలితాలపై ఈసీ నిర్ణయం

ర్యాలీలు, ఊరేగింపులకు నో చాన్స్.. ఎన్నికల ఫలితాలపై ఈసీ నిర్ణయం

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల విషయంలో భారత ఎన్నికల కమిషన్ కొన్ని రూల్స్ తీసుకొచ్చింది. ఎలక్షన్ ఫలితాలు వెలువడిన తర్వాత చేసుకునే గెలుపు సంబురాలపై ఈసీఐ నిషేధం విధించింది. మే 2న ఎన్నికల రిజల్ట్స్ వెలువడనున్నాయి. ఈ క్రమంలో ఓట్ల కౌంటింగ్ రోజు తీసుకోబోయే చర్యలు, పాటించాల్సిన నియమాలపై త్వరలో ఈసీఐ ఉత్తర్వులను జారీ చేయనుంది. గెలిచిన అభ్యర్థులు ఊరేగింపులు, ర్యాలీలు చేసుకోవడానికి వీల్లేదని ఈసీఐ స్పష్టం చేసింది. కాగా, తమిళనాడులో కరోనా సెకండ్ వేవ్ ఉధృతికి ఎన్నికల కమిషన్ అధికారులే కారణమని సోమవారం మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసీ అధికారులపై మర్డర్ కేసు ఎందుకు పెట్టకూడదో చెప్పాలంటూ హైకోర్టు హెచ్చరించింది. ఓట్ల కౌంటింట్‌‌కు ఏమేం జాగ్రత్తలు తీసుకుంటున్నారో చెప్పాలని ఆదేశించింది.