నేను చెబుతూనే ఉన్నా.. మోడీ ప్రభుత్వం చేతిలో ఈసీ కీలుబొమ్మ: ఎంపీ కపిల్ సిబల్

నేను చెబుతూనే ఉన్నా.. మోడీ ప్రభుత్వం చేతిలో ఈసీ కీలుబొమ్మ: ఎంపీ కపిల్ సిబల్

న్యూఢిల్లీ: ఎలక్షన్ కమిషన్ (ఈసీ) ఎల్లప్పుడు మోదీ ప్రభుత్వం చేతిలో ‘కీలుబొమ్మ’ గానే ఉందని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాని చేతిలో ఈసీ కీలుబొమ్మగా మారింది. ఈసీ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. నిజం చెప్పాలంటే ప్రతి ఎలక్షన్ కమిషనర్ మోదీ ప్రభుత్వంతో పొత్తులో మునుపటి వారిని అధిగమిస్తారు. 

బిహార్‎లో ఈసీ చేపట్టిన స్పెషల్ సర్వే రాజ్యాంగ విరుద్ధం. పౌరసత్వానికి సంబంధించిన అంశాలను నిర్ణయించే అధికారం ఈసీకి లేదు. ఎన్నికల్లో ఏదో ఒక విధంగా గెలవడానికి బీజేపీ అన్ని మార్గాలను అన్వేషిస్తుందని గత కొంతకాలంగా నేను చెబుతూనే ఉన్నాను. ఈసీ చేపట్టిన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ రాబోయే కాలానికి మెజారిటీ ప్రభుత్వాలను నిర్ధారించే ప్రక్రియ” అని పేర్కొన్నారు.