సుప్రియా శ్రీనతే, దిలీప్ ఘోష్​లకు ఈసీ నోటీసులు

సుప్రియా శ్రీనతే, దిలీప్ ఘోష్​లకు ఈసీ నోటీసులు
  •  ఈ నెల 29 లోగా సమాధానం ఇవ్వాలన్న ఈసీ

న్యూఢిల్లీ: మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుడు దిలీప్ ఘోష్, కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనతేలకు ఎలక్షన్ కమిషన్ (ఈసీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారి వ్యాఖ్యలు మహిళలను అవమనించేలా ఉన్నాయని బుధవారం ఈసీ తెలిపింది. ఆ వ్యాఖ్యలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో గౌరవప్రదంగా వ్యవహరించాలని ఈసీ సూచించింది. 

ప్రత్యర్థులను అవమానించేలా వ్యక్తిగత దూషణలకు దిగరాదని పేర్కొంది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు మహిళల గౌరవానికి భంగం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని వెల్లడించింది. షోకాజ్ నోటీసులకు ఇద్దరు నేతలు మార్చి 29 సాయంత్రం లోగా సమాధానం ఇవ్వాలని ఈసీ కోరింది.