అజిత్ పవార్ వర్గానిదే ఎన్సీపీ.. శరద్ పవార్​కు ఈసీ షాక్

అజిత్ పవార్ వర్గానిదే ఎన్సీపీ.. శరద్  పవార్​కు ఈసీ షాక్

న్యూఢిల్లీ: సీనియర్​ పొలిటీషియన్ శరద్ పవార్ కు ఎలక్షన్ కమిషన్(ఈసీ) షాక్ ఇచ్చింది. అజిత్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) వర్గానికి అనుకూలంగా మంగళవారం తీర్పునిచ్చింది. అజిత్ సారథ్యంలోని ఎన్సీపీనే అసలైన పార్టీగా ఈసీ ప్రకటించింది. పార్టీ పేరు, గుర్తు అజిత్ వర్గానికే కేటాయించింది. దీంతోపాటు నిధులు, బ్యాంక్ అకౌంట్లపై నియంత్రణ కూడా దక్కనుంది.

మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 12 మంది శరద్ వర్గానికి, 41 మంది అజిత్ వర్గానికి మద్దతు పలుకుతున్నారు. ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని ఆధారంగా చేసుకుని అజిత్ పవార్ వర్గాన్ని అసలైన ఎన్సీపీగా గుర్తిస్తూ ఈసీ నిర్ణయాన్ని వెలువరించింది. లోక్‌‌‌‌సభ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనున్న నేపథ్యంలో శరద్ వర్గానికి గట్టి దెబ్బ తగిలినట్టయింది. గతేడాది జులైలో తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో అజిత్ పవార్ ఎన్సీపీని వీడారు.

Also read :లివ్ ఇన్ ​కూ రిజిస్ట్రేషన్ చేయకుంటే జైలు శిక్ష.. యూసీసీలో ప్రతిపాదన