ఎకో ఫ్రెండ్లీ.. గ్రీన్ సిటీస్

ఎకో ఫ్రెండ్లీ.. గ్రీన్ సిటీస్
  • పర్యావరణ హితం కొత్త మున్సిపల్ చట్టం

ఇల్లు, షాపుల ముందు మొక్కలు నాటి, పచ్చదనం పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్త మున్సిపల్‌ చట్టంలో నిబంధన తేనుంది. గ్రీనరీ, ఎకో ఫ్రెండ్లీ అంశాలకు ప్రాధాన్యమిస్తూ మున్సిపల్‌ యాక్ట్‌-2019 ను రూపొందిస్తోంది. హరితహారంలో పెద్దఎత్తున మొక్కలు నాటుతున్నా…మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆశించిన గ్రీనరీ డెవలప్ మెంట్ కావడం లేదు. పట్టణీకరణలో భాగంగా మల్టీ స్టోరీడ్​ ​బిల్డిం గ్స్​కు, శివారు ప్రాంతాల్లో రియల్‌ వెంచర్లకు భారీగా చెట్లు, జలవనరులు వాడుతున్న ఉదంతాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిబంధన తెస్తోంది. మున్సిపాలిటీల్లో లే అవుట్లు, బిల్డింగ్ ల  నిర్మాణానికి అనుమతులిచ్చే టైంలోనే మొక్కలు నాటాలన్న ఆంక్షలు పెట్టనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నిబంధనలున్నప్పటికీ పర్మిషన్ల సమయంలో కొంతమంది అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు.

ఫైర్ సేఫ్టీ మాదిరిగానే…

షాపు యజమానే సామాజిక బాధ్యతగా మొక్కల పెంపకం చేపట్టాలని మున్సిపల్​ చట్టంలో నిబంధన పెట్టనున్నారు. చిన్నపాటి షాపులకు పర్మిష న్‌ , రెన్యూ వల్స్‌‌‌‌‌‌‌‌ టైంలో కూడా గ్రీనరీ నిబంధనలకు లోబడి మున్సిపల్​ యంత్రాంగం కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఫైర్‌ సేఫ్టీ మాదిరిగానే తప్పకుండా మొక్కలు పెంచాలని చట్టంలో పొందుపరుస్తున్నట్టు తెలుస్తోంది. గ్రేటర్​ పరిధిలోని హై రైజ్ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ పర్మిషన్లకు ఈ నిబంధనలు కచ్చి తంగా అమలయ్యేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది.