లిక్కర్ స్కాం : నిందితుల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

లిక్కర్ స్కాం : నిందితుల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులోని నిందితుల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. సమీర్ మహేంద్రు నివాసం, దినేష్ అరోరా, విజయ్ నయర్ నివాసం, అమిత్ అరోరా ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్షీట్ను విచారణకు స్వీకరించడంపై సీబీఐ కోర్టు ఈనెల 28న నిర్ణయం తీసుకోనుంది. ఈడీ దాఖలు చేసిన 13,567 పేజీల చార్జ్ షీట్​లో ఐదుగురు నిందితులు, ఏడు కంపెనీలపై అభియోగాలు ఉనట్లు ఈడీ తరఫు న్యాయవాది నవీన్ కుమార్ గతంలో కోర్టుకు వివరించారు. ఇందులో రాబిన్ డిస్టిలరీస్ డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, ఇండో స్పిరిట్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మహేంద్రు, ఆప్ కమ్యూనికేషన్ ఇన్​చార్జ్ విజయ్ నాయర్, బిజినెస్ మెన్ బినోయ్ బాబు, అమిత్ అరోరా పేర్లను ప్రస్తావించినట్లు బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు.దీనిపై స్పందించిన జడ్జి నాగ్ పాల్.. సప్లిమెంటరీ చార్జ్ షీట్​ను పరిగణలోకి తీసుకునే అంశంపై ఈ నెల 28న విచారణ జరుపుతామని వెల్లడించారు.