శివసేన ఎమ్మెల్యే ఇళ్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు

శివసేన ఎమ్మెల్యే ఇళ్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు

ముంబై: మహారాష్ర్ట శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ ఇళ్లు.. ఆఫీసుల్లో ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ సోదాలు ప్రారంభించింది. ముంబై, థానే నగరాల్లో మొత్తం 10 చోట్ల  ఆయన సంబంధీకుల కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో ఉదయమే దాడి చేసింది. తెల్లవారుజామునే ఆయన ఇంటికి చేరుకుని మనీ లాండరింగ్ ఆరోపణల కేసులో సోదాలు చేస్తున్నట్లు ప్రకటించారు. మహారాష్ట్రలో శివసేన పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న ఆయన థానేలోని ఓవ్లా మజ్వాడ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవల బాలీవుడ్ నటి కంగనా రౌత్ పై ఆయన చేసిన కామెంట్లు దుమారం రేపాయి.

ముంబైని పాక్ అక్రమిత కాశ్మీర్ తో పోల్చిన కంగనా రౌగ్ పై దేశ ద్రోహం కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కంగన రౌత్ ఇక్కడకువస్తే ముంబై మహిళలు ఆమెను నిద్రపోనివ్వరంటూ ఆయన చేసిన కామెంట్లపై కంగనారౌత్ తోపాటు పలువురు తీవ్రంగా ఖండించారు. ఈ నేపధ్యంలో ఆయనపై మనీలాండరింగ్ ఆరోపణలు రావడం.. ఆ వెంటనే ఈడీ కూడా రంగంలోకి దిగి దాడలు చేపట్టడం కలకలం సృష్టించింది.