బ్యాంకులకు 90కోట్ల టోపీ పెట్టిన సంజయ్ అగర్వాల్

బ్యాంకులకు 90కోట్ల టోపీ పెట్టిన సంజయ్ అగర్వాల్

హైదరాబాద్: ఘన్ శ్యాందాస్ జెమ్స్ అండ్ జ్యువెల్స్ ఎండీ సంజయ్ అగర్వాల్ పై ఈడీ చార్జ్ షీట్ దాఖలు చేసింది. తప్పుడు పత్రాలతో బ్యాంకులను 90కోట్ల మోసం చేసినట్లు అభియోగం మోపింది ఈడీ. సీబీఐ నమోదు చేసిన కేసుల ఆధారంగా మనీలాండరింగ్ విచారణ చేసిన ఈడీ తాజాగా చార్జిషీట్ దాఖలు చేసింది. 
తప్పుడు పత్రాలతో బ్యాంకులకు 90కోట్ల రూపాయలు మోసం చేసినట్లు ఈడీ ప్రాధమిక విచారణలో తేల్చింది.

బ్యాంకులను మోసం చేసి తీసుకున్న డబ్బుతో నగల దుకాణాలు నిర్వహించారని..  సంజయ్ అగర్వాల్ తన కుటుంబ సభ్యుల పేర్లతో నాలుగు దుకాణాలను ప్రారంభించినట్లు ఈడీ గుర్తించింది. అంతేకాదు సంజయ్ కుమార్ తప్పుడు పేరుతో విదేశాలకు వెళ్లి బ్యాంకు అక్కౌంట్స్ తెరిచారని.. అలాగే ఉద్యోగుల పేరుతో బినామీ ఆస్తులు కూడబెట్టుకున్నట్లు గుర్తించారు. 
అభియోగాలకు తగిన ఆధారాలు దొరకడంతో సంజయ్ అగర్వాల్ కు సంబంధించిన 9.5 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అధికారులు జప్తు చేశారు. శంషాబాద్, తెల్లాపూర్, రాయదుర్గం, కొంపల్లి, జూబ్లిహిల్స్ ప్రాంతాల్లోని భూములు అటాచ్ చేశారు. ఈ కేసులో సంజయ్ అగర్వాల్ ను గత ఫిబ్రవరి 11న అరెస్టు చేశామని ఈడీ అధికారులు తెలిపారు. 

 

ఇవి కూడా చదవండి

ఎల్లుండి నుంచి వడ్ల కొనుగోళ్లు ప్రారంభం

 

ఐఏఎస్ శ్రీలక్ష్మి పిటిషన్ కొట్టేసిన ఏపీ హైకోర్టు

అక్బరుద్దీన్పై నమోదైన కేసుల కొట్టివేత

కేసీఆర్ అరెస్ట్ కావడం ఖాయం