పాట్నా: రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్‌కు ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది. రైల్వే ల్యాండ్ ఫర్ జాబ్స్ మనీలాండరింగ్ కేసులో తండ్రీకొడుకులకు ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 29న లాలూను, 30వ తేదీన తేజస్విని పాట్నా ఆఫీసులో విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ నోటీసులను లాలూ అధికారిక నివాసం వద్ద ఆయన భార్య రబ్రీ దేవికి ఈడీ అధికారులు అందజేశారు. 2004 నుంచి 2009 వరకు యూపీఏ ప్రభుత్వంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి, ఎలాంటి ప్రకటనలు, పబ్లిక్ నోటీసు లేకుండా అనుకూలమైన వారిని రైల్వేలో నియమించారని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి.
