కర్నాటక ఎమ్మెల్యే సంస్థలపై ఈడీ దాడులు

కర్నాటక ఎమ్మెల్యే సంస్థలపై ఈడీ దాడులు

బెంగళూరు: కర్నాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే నంజేగౌడ ఇండ్లు, ఆఫీసుల్లో ఈడీ సోమవారం సోదాలు చేసింది. మలూరు, కోలార్ లోని ఎమ్మెల్యేకు చెందిన పలు సంస్థల్లో తనిఖీలు నిర్వహించింది. కర్నాటకలో అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసే కోలార్– చిక్కబళ్లాపూర్ డిస్ట్రిక్ కో ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్ ( కోముల్)కు నంజేగౌడ  ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. 

కోముల్ స్టాఫ్ నియామకంలో ఆయన పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై  స్థానిక పోలీసులు ఆయనపై  ఎఫ్​ఐఆర్ దాఖలు చేశారు. దాని ఆధారంగా ఎమ్మెల్యేపై  మనీలాండరింగ్ అభియోగాలు మోపుతూ ఈడీ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే కోలార్ లోని మిల్క్ ప్లాంట్ తో పాటు ఆఫీసులోనూ సెర్చ్  చేసింది.  కాగా, నంజేగౌడ కోలార్ జిల్లాలోని మలూర్ అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.