మళ్లీ తెరపైకి టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ

మళ్లీ తెరపైకి టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ

టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈడీ కోర్ట్ ధిక్కరణ పిటీషన్ తో కదిలింది రాష్ట్ర ప్రభుత్వం. ఈడీ అడిగిన అన్ని వివరాలు ఇచ్చింది ప్రభుత్వం. డిజిటల్ రీకార్డ్స్ , కాల్ డేటా, FSL నివేదికలను ఈడీకి ఇచ్చినట్టు తెలిపింది సర్కార్. ఈడీ అడిగిన వివరాలు ఇచ్చినట్లు హైకోర్టు రిజిస్టర్ కు మెమో దాఖలు చేసింది ప్రభుత్వం. కేసు విచారణలో ప్రభుత్వం తమకు సహకరించడం లేదని... గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోవడం లేదని చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్పరాజ్ అహ్మద్ పై హైకోర్టు లో కోర్టు దిక్కరణ పిటిషన్ వేసింది ఈడీ. ప్రభుత్వం మెమోతో కోర్టు ధిక్కరణ పిటిషన్ వెనక్కి తీసుకుంది ఈడీ. 

ప్రభుత్వ నిర్ణయంతో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మళ్ళీ దూకుడు పెంచనుంది ఈడీ. మరోసారి డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ తారలను మరోసారి విచారించనుంది ఈడీ. ప్రభుత్వం , ఎక్సైజ్ శాఖ ఇచ్చిన డిజిటల్ రీకార్డ్స్, కాల్ డేటా ను పరిశీలిస్తున్నారు ఈడీ అధికారులు. వీటి ఆధారంగా సినీ ప్రముఖులను ప్రశ్నించనుంది. డ్రగ్స్ లావాదేవీలు, డ్రగ్స్ కొనుగోళ్లు,మనీ ల్యాండరింగ్ అంశాలపై కూపీ లాగుతోంది ఈడీ. 

టీఆర్ఎస్ ఎంపీలు పోరాటం చేయట్లే..కాలక్షేపం చేస్తుండ్రు

గేదెను తప్పించబోయి ఆర్టీసీ బస్సు తుక్కుతుక్కు