జూన్ 3 నుంచి టెన్త్ అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ ..షెడ్యూల్ రిలీజ్ చేసిన విద్యాశాఖ

జూన్ 3 నుంచి టెన్త్ అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ ..షెడ్యూల్ రిలీజ్ చేసిన విద్యాశాఖ

హైదరాబాద్, వెలుగు: పదో తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13 వరకు నిర్వహించనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు జూన్ 11తో ముగుస్తాయని ఆయన తెలిపారు. ఈ మేరకు గురువారం పరీక్షల షెడ్యూల్​ను రిలీజ్ చేశారు. ప్రతిరోజూ ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం12.30 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయి. అయితే, సైన్స్ పరీక్షలు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి 11గంటల వరకే ఉంటాయి. 

కాగా, ఫెయిలైన విద్యార్థులు, మార్కులు ఎక్కువగా తెచ్చుకోవాలని ఇంప్రూవ్ మెంట్ రాయాలనుకున్న విద్యార్థులు ఈ నెల 16 వరకు ఎగ్జామ్ ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంది. రూ.50 ఫైన్​తో ఎగ్జామ్ కు రెండ్రోజుల ముందు వరకూ ఫీజు చెల్లించవచ్చు.