స్టూడెంట్స్, పేరెంట్స్ ఒత్తిడి పెడుతున్నారు: పోఖ్రియాల్

స్టూడెంట్స్, పేరెంట్స్ ఒత్తిడి పెడుతున్నారు: పోఖ్రియాల్

న్యూఢిల్లీ: జేఈఈ, నీట్ ఎగ్జామ్స్‌ నిర్వహించాల్సిందేనని విద్యార్థుల తల్లిదండ్రులు తమను ఒత్తిడి చేస్తున్నారని ఎడ్యుకేషన్ మినిస్టర్ రమేశ్ పోఖ్రియాల్ అన్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి 6 వరకు జేఈఈ, అలాగే 13న నీట్ పరీక్షలు జరగాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో తగు జాత్రత్తల మధ్య ఈ ఎగ్జామ్స్‌ను నిర్వహించడానికి కేంద్రం సమాయత్తమవుతోంది.

కరోనా నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థుల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా పరీక్షలపై ముందుకెళ్లడం ఏంటని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మండిపడ్డారు. ఈ విషయంలో కేంద్రంపై సుప్రీం కోర్టులో తేల్చుకోవాలని సోనియాతో సహా ఏడు రాష్ట్రాల సీఎంలు సమాలోచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయంపై రమేశ్ పోఖ్రియాల్ స్పందించారు. ‘ఎగ్జామ్స్ నిర్వహించాలని స్టూడెంట్స్‌తోపాటు వారి తల్లిదండ్రులు మాపై నిరంతరం ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ పరీక్షల తేదీలు రెండుసార్లు పోస్ట్‌పోన్ అయిన తర్వాతే ఫైనలైజ్ అయ్యాయి. మహమ్మారి వల్ల ఒక విద్యా సంవత్సరం పూర్తిగా వృథా కావొద్దని సుప్రీం కోర్టు చెప్పింది’ అని పోఖ్రియాల్ పేర్కొన్నారు.