రీ రిలీజ్లో దుమ్మురేపుతున్న ఈ న‌గ‌రానికి ఏమైందీ క‌లెక్ష‌న్స్

రీ రిలీజ్లో దుమ్మురేపుతున్న ఈ న‌గ‌రానికి ఏమైందీ క‌లెక్ష‌న్స్

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల హవా నడుస్తోంది. పోకిరి(Pokiri)తో స్టార్ అయినా ఈ ట్రెండ్ ఇప్పుడప్పుడే ఆగే సూచనలు కనిపించడంలేదు. ఈ ట్రెండ్ లోనే తాజాగా రిలీజైన సినిమా ఈ నగరానికి ఏమైంది(Ee Nagaraaniki emaindi)? ఈ సినిమా రిలీజై ఐదేళ్లు పూర్తయిన సందర్బంగా రీ రిలీజ్ చేశారు మేకర్స్.

రీ రిలీజ్ లో ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి భారీ స్పందన వస్తోంది. జూన్ 29న రీ రిలీజైన ఈ సినిమా.. అదిరిపోయే ఓపెనింగ్స్ రాబట్టి అందరిని షాక్ కి గురి చేసింది. సినిమాను థియేటర్స్ లో చూసేందుకు యూత్ ఎగబడ్డారు. గత రెండు రోజుల నుండి అన్ని షోస్ హౌస్ ఫుల్ గా నడుస్తోంది ఈ సినిమా. రిలీజ్ డేట్ ప్రకటించిన తరువాత అడ్వాన్స్ బుకింగ్ లో జోరు చూపించిన ఈ మూవీ..  రిలీజ్ తరువాత కలెక్షన్స్ కూడా అదే హవాను కొనసాగిస్తోంది. 

ఇక ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పటికంటే.. రీ రిలీజ్ లోనే ఎక్కువ ఓపెనింగ్స్ రాబట్టింది ఈ సినిమా. ఇక్కడ మరో విశేషం ఏంటంటే? జూన్ 29న స్పై, సామజవరగమనా వంటి డైరెక్ట్ సినిమాలతో పోటీగా ఈ నగరానికి ఏమైంది సినిమా రిలీజ్ అయింది.  అయితే మిగతా రెండు సినిమాల కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టి ఆశ్చర్యానికి గురి చేసింది ఈ సినిమా. రీ రిలీజ్ లో స్టార్ హీరోల సినిమాలకు మంచి కలెక్షన్స్ సాధించిందంటే.. ఈ నగరానికి ఏమైంది సినిమాకు యూత్ లో ఎంత క్రేజ్ ఉందొ అర్థమవుతోంది. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా స్టార్ హీరోల రికార్డ్స్ కూడా బ్రేక్ చేయడం ఖాయం అనేది ట్రేడ్ వర్గాలు టాక్.