చిన్నోనిపల్లి రిజర్వాయర్ లో వర్షపు నీరు నిల్వ చేయం : ఈఈ రహిమోద్దీన్

చిన్నోనిపల్లి రిజర్వాయర్ లో వర్షపు నీరు నిల్వ చేయం : ఈఈ రహిమోద్దీన్

గద్వాల, వెలుగు: చిన్నోనిపల్లి రిజర్వాయర్ లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో రాంచందర్, ఇరిగేషన్  ఈఈ రహిమోద్దీన్  తెలిపారు. బుధవారం గట్టు మండలం చిన్నోనిపల్లి రిజర్వాయర్, ఆర్అండ్ఆర్  సెంటర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

పరిహారం తక్కువగా వచ్చిందని, పనులు పెండింగ్​లో ఉండడంతో ఇబ్బంది పడుతున్నామని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. మల్లన్నసాగర్  నిర్వాసితులకు ఇచ్చిన పరిహారాన్నే తమకు ఇవ్వాలని కోరారు. స్పందించిన ఆఫీసర్లు రిజర్వాయర్​లో నీరు నిల్వ ఉండకుండా వెంటనే కాలువ తవ్విస్తామని, నిర్వాసితుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.