
తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా(Eesha Rebba) షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ‘మామా మశ్చీంద్ర’ అనే సినిమాలో ఈ కోల కళ్ల బ్యూటీ నటిస్తోంది. మరోవైపు ఈషా నటించిన ‘మాయాబజార్ ఫర్ సేల్’ అనే సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ షోలో పాల్గొంది.
ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానమిచ్చింది. పెళ్లి తొందరగా చేసుకోవాలని ఎప్పుడనిపిస్తుంది? అని అడగ్గా తొందరపడ్డప్పుడు అంటూ కొంటెగా నవ్వేసింది. మీ ప్రేమకథ గురించి చెప్పమని అడిగితే నాకు ఇప్పటికే ఇద్దరు పిల్లలున్నారంటూ బాంబు పేల్చింది. అయితే, ఈషా చెప్పిన ఆ ఇద్దరు పిల్లలు ఎవరా? అని నెటిజన్లు సందిగ్ధంలో పడ్డారు. ఈ బ్యూటీ పెళ్లికి ముందే పిల్లలను దత్తత తీసుకుందా లేక తన పెట్స్ గురించి ఇలా చెప్పిందా అనేది తెలియాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన క్లిప్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రస్తుతం ఈషా రెబ్బా.. జేడీ చక్రవర్తితో పాటు `దయా` వెబ్ సిరీస్‌లో నటించింది. ఇది త్వరలోనే రిలీజ్ కాబోతుంది. దీంతోపాటు `మాయాబజార్` అనే వెబ్ సిరీస్ చేసింది. ఇది ఇటీవల విడుదలై స్ట్రీమింగ్ అవుతుంది. దీనికి పాజిటివ్ టాక్ వస్తోంది.