సింగరేణి అభివృద్ధిని పట్టించుకోని కేసీఆర్

సింగరేణి అభివృద్ధిని పట్టించుకోని కేసీఆర్

సింగరేణి విషయంలో సీఎం కేసీఆర్ వైఖరిపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. సింగరేణిని ప్రైవేటుపరం చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి కేంద్రంపై అబద్దపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఓపెన్ కాస్ట్ గనుల్లో 70శాతానికి మించి ప్రైవేటీకరణ చేయొద్దన్న కేసీఆర్... ఇప్పుడు 86శాతం గనుల్ని ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గతంలో 63వేలుగా ఉన్న కార్మికుల సంఖ్య ఇప్పుడు 43వేలకు తగ్గిపోయిందని, ఇందుకు ప్రధాన కారణం సీఎం కేసీఆర్ అని ఈటల ఆరోపించారు. సింగరేణి అభివృద్ధిపై ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా బొగ్గు శాఖ మంత్రిని కలవలేదన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. బ్యాంకు నుంచి అప్పు తెచ్చి సింగరేణి కార్మికుల జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ లాంటి వ్యక్తి పాలనలో సింగరేణి కార్మికుల బతుకులు ఏ మాత్రం మారవని అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తల కోసం..

టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. హైకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించే ఉద్దేశం లేదు

తిరుపతిలో వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం