తెలంగాణలో ఆచూకీ లేని ఇద్దరు ఒమిక్రాన్ పేషెంట్లు

తెలంగాణలో ఆచూకీ లేని ఇద్దరు ఒమిక్రాన్ పేషెంట్లు

మొన్నటి వరకూ డెల్టా టెన్షన్.. ఇప్పుడు ఒమిక్రాన్ టెన్షన్. వైరస్ ఒకటే అయినా.. కొత్త వేరియంట్స్ అంటే వణికిపోతున్నారు జనం. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ రాకపోకలు ఎక్కువ కావడంతో.. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికే టిమ్స్ హాస్పిటల్స్ లో ఒమిక్రాన్ బాధితులు,  అనుమానితులు మొత్తం 40మందికి పైగా ఉన్నారు.  అయితే రెండ్రోజుల క్రితం పాజిటివ్ అని తేలిన 12 ఒమిక్రాన్ కేసుల్లో ఇద్దరు బాధితుల ఆచూకీ ఇంకా దొరకలేదు. వైద్య సిబ్బంది మాత్రం కాంటాక్ట్ ట్రేసింగ్ కంటిన్యూ చేస్తున్నారు. రోజు రోజుకి ఒమిక్రాన్ కేసులతో పాటు అనుమానితుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో గాంధీ మెడికల్ కాలేజ్ లో జీl సీక్వెన్స్ ను ప్రారంభించింది ఆరోగ్యశాఖ. ఇప్పటికే ట్రయిల్స్ సక్సెస్ కావడంతో 48 శాంపిల్స్ టెస్ట్ చేస్తున్నారు. 

ఇక  గాంధీ హాస్పిటల్ లో ఒమిక్రాన్ బాధితుడికి సీరియస్ గా ఉందన్న వార్తల్లో నిజం లేదని తేలిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అతనికి కరోనా మాత్రమే ఉందనీ.. ఒమిక్రాన్ ఇంకా నిర్ధారణ కాలేదని చెప్పారు. ఐదారు రోజుల క్రితం వచ్చిన సోమాలియా వ్యక్తి ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో క్యాన్సర్ ట్రీట్మెంట్ తీస్కోవడానికి అడ్మిట్ అయ్యాడు.  ట్రీట్మెంట్ లో భాగంగా చేసిన పరీక్షల్లో కరోనా నిర్ధారణ కావడంతో.. హెల్త్ అధికారులకు సమాచారం ఇచ్చారు హాస్పిటల్ సిబ్బంది. దీనికి తోడు అతని కండిషన్ సీరియస్ గా ఉండటంతో... టిమ్స్ కంటే గాంధీ బెటర్ అని అక్కడికి తరలించామంటున్నారు అధికారులు.  గాంధీ హాస్పిటల్ లో సెపరేట్ వార్డులో ట్రీట్మెంట్ అందిస్తున్నారు  డాక్టర్లు.