నెక్కొండ/రాయపర్తి, వెలుగు: గురుకుల టీచర్ల సమ్యలను పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. వరంగల్జిల్లా నెక్కొండ పట్టణంలోని టీఎస్రెసిడెన్సియల్ స్కూల్‌లో పీఆర్టీయూ సభ్యత్వ నమోదు ప్రోగ్రాంను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెసిడెన్సియల్స్కూల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. టీచర్ల సమస్యల సాధనలో పీఆర్టీయూ ముందుంటుందన్నారు. అంతకుముందు రాయపర్తిలోని సోషల్ వెల్ఫేర్ స్కూల్‌లోనూ మెంబర్‌షిప్ కార్యక్రమం నిర్వహించారు.
ఆయన వెంట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవీందర్రెడ్డి, మహేందర్రెడ్డి మండల అధ్యక్ష, కార్యదర్శులుచ ప్రతాప్సింగ్, ప్రవీన్ తదితరులున్నారు.
