కిచెన్ తెలంగాణ: వావ్ ఎగ్స్.. వెరీ టేస్టీ! ఇలా చేస్తే ఎగ్ ఇష్టపడని వాళ్లు కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు !

కిచెన్ తెలంగాణ: వావ్ ఎగ్స్.. వెరీ టేస్టీ! ఇలా చేస్తే ఎగ్ ఇష్టపడని వాళ్లు కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు !

ఎగ్స్తో ఎన్నో రకాల వంటలు చేసి ఉంటారు. కానీ, ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా..? ఈ రెసిపీలు చేయడానికి పది నిమిషాలు కూడా పట్టదు. కానీ, వీటి టేస్ట్ మాత్రం ప్రతిరోజూ తినాలనిపించేలా ఉంటుంది. ఎగ్ ఇష్టపడని వాళ్లు కూడా ఎంజాయ్​ చేస్తూ తినేస్తారు. మరింకేం ఈస్టర్​ సందర్భంగా.. ఎగ్స్​తో ఈ వెరైటీలు షురూ చేయండి. 

పింక్ ఎగ్స్

  • కావాల్సినవి: కోడిగుడ్లు - పది
  • బీట్​రూట్, ఊరబెట్టిన కీరదోస (జుకిని) - ఒక్కోటి
  • వేడి నీళ్లు, ఉప్పు - సరిపడా
  • వెనిగర్ - ఒక టేబుల్ స్పూన్
  • ఆవాలు, నల్ల మిరియాల పొడి - ఒక్కో టీస్పూన్
  • క్రీమ్ చీజ్ - రెండు టేబుల్ స్పూన్లు
  • మస్టర్డ్ సాస్ - అర టీస్పూన్
  • కొత్తిమీర - కొంచెం

తయారీ:
ఉడికించిన కోడిగుడ్లను తొక్క తీసి ఒక గిన్నెలో వేయాలి. అందులో బీట్​రూట్ ముక్కలు, ఉప్పు, వెనిగర్ వేసి వేడినీళ్లు పోసి కాసేపు పక్కన ఉంచాలి. ఆ తర్వాత కోడిగుడ్లను నిలువుగా కట్ చేసి లోపల ఉన్న పచ్చసొనను వేరుచేయాలి. ఒక మిక్సీజార్​లో పచ్చసొనలు, ఊరబెట్టిన కీరదోస తరుగు, క్రీమ్ చీజ్, ఉప్పు, నల్ల మిరియాల పొడి, మస్టర్డ్ సాస్ వేసి గ్రైండ్ చేయాలి. చివరగా ఎగ్ వైట్స్​లో ఈ క్రీమ్‌ని పెట్టాలి. దానిపై కొత్తిమీర చల్లాలి.

ఎగ్ కలక్కి

  • కావాల్సినవి: కోడిగుడ్లు - రెండు,  ఉప్పు, కారం, మిరియాల పొడి - సరిపడా
  • నూనె - రెండు టీస్పూన్లు,  కొత్తిమీర - కొంచెం

తయారీ:
ఒక గిన్నెలో కోడిగుడ్ల సొన, ఉప్పు, మిరియాల పొడి, కారం, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. పాన్​లో నూనె వేసి వేడి చేసి అందులో కోడిగుడ్ల మిశ్రమం పోయాలి. ఆమ్లెట్​లా కాకుండా మడతపెడుతూ ఉడికించాలి. లోపల సొన కాస్త పచ్చిగా ఉండగానే తీసేయాలి. దీన్ని కావాలంటే ముందుగా కోడిగుడ్ల సొన వేసి ఉడికాక, దానిపై కారం, మిరియాల పొడి, కొత్తిమీర, ఉప్పు చల్లుకోవచ్చు.

ఎగ్ భేజొ

కావాల్సినవి:

  • కోడిగుడ్లు - రెండు
  • నూనె, ఉప్పు - సరిపడా
  • ఉల్లిగడ్డ తరుగు - ఒక కప్పు
  • వెల్లుల్లి తరుగు - రెండు టేబుల్ స్పూన్లు
  • ఎండుమిర్చి - పది
  • ఉప్పు నీళ్లు, లెమన్ వాటర్, చింతపండు రసం, నూనె - ఒక్కోటి పావు టీస్పూన్

తయారీ:
పాన్​లో నూనె వేడి చేసి అందులో ఉల్లిగడ్డ తరుగు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేగించాలి. వాటిని ఒక ప్లేట్​లోకి తీశాక, అందులో వెల్లుల్లి తరుగు, ఎండు మిర్చి ఒకదాని తర్వాత ఒకటి వేసి వేగించి పక్కన పెట్టాలి. తర్వాత మిక్సీజార్​లో ఎండు మిర్చి వేసి గ్రైండ్ చేయాలి. ఆ పొడిని ఒక గిన్నెలో వేసి అందులో వేగించిన ఉల్లిగడ్డ, వెల్లుల్లి తరుగు వేసి చేత్తో నలుపుతూ  బాగా కలపాలి.

ఉడికించిన కోడిగుడ్లను తొక్క తీసి, నిలువుగా కట్​ చేయాలి. దాని మధ్యలో ఉల్లిగడ్డ, వెల్లుల్లి మిశ్రమం పెట్టాలి. దానిపై ఉప్పునీళ్లు, లెమన్ వాటర్, చింతపండు రసం, నూనె ఒక్కోటి పావు టీస్పూన్ చొప్పున వేయాలి. ఆపై కొత్తిమీర చల్లాలి.