
ఐరన్ లేడీ తలెత్తుకుని సగర్వంగా నిలబడింది. ఐఫిల్ టవర్ 130వ పుట్టినరోజును జరుపుకుంది. పర్యాటకులు, దాని సంరక్షకులు చూపుతున్న ప్రేమకు రంగు రంగుల లేజర్ లైట్లతో వెలిగి మురిసిపోయింది. బుధవారం ఐఫిల్ టవర్ పుట్టిన రోజు కేక్ కట్ చేసింది. 1889 మే 15న తొలిసారి పర్యాటకుల కోసం ఐఫిల్ టవర్ ను ప్రారంభించారు. ఐరన్ లేడీ పుట్టిన రోజు సందర్భంగా 1300 మంది చిన్నారులకు ఆ టవర్ కింద పెద్ద పార్టీనే ఇచ్చారు. శుక్రవారం రాత్రిదాకా లేజర్ వెలుగుల్లో అది జిలుగులు పంచనుంది. ఇన్నేళ్ల చరిత్రలో దానిని పడగొట్టాలన్న డిమాండ్లు ఇటీవలి కాలంలో బాగా వచ్చాయి. కానీ, పర్యాటక ప్రేమికులు మాత్రం దానిని అలాగే ఉండనివ్వాలని తేల్చి చెప్పారు. ఏటా ఐఫిల్ టవర్ ను చూసేందుకు 60 లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు.