అడవి ఏనుగును చంపి దంతాల అమ్మకం: 8మంది అరెస్ట్

అడవి ఏనుగును చంపి దంతాల అమ్మకం: 8మంది అరెస్ట్

అడవి ఏనగును చంపి వాటి దంతాలను అమ్మేందుకు ప్రయత్నించిన ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఘటన చత్తీస్ ఘడ్ లోని బల్ రామ్ పూర్ జిల్లాలో జరిగింది. ఈ నెల 18న దంతాలు లేని ఏనుగు మృతదేహాన్ని సోన్హాట్ గ్రామానికి దగ్గరలో ఉన్న రఘునాథ్ నగర్ అడవిలో కనుగొన్నట్టు చెప్పారు అటవీశాఖ అధికారులు. ఏనుగును చంపి దాని దంతాలను నరికి తీసుకెళ్లిన వారికోసం రెండు రోజులుగా గాలించినట్లు తెలిపారు. దీంతో 11మంది ఏనుగును చంపారని చెప్పారు. బుధవారం ఎనిమిది మందిని అరెస్ట్ చేశామని మరో ముగ్గురు పరారీలో ఉన్నారని తెలిపారు. వీరి నుంచి ఏనుగు దంతాలను స్వాదీనం  చేసుకున్నారు. నింధితులందరూ సోన్హాట్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

నవంబర్ ఆరో తేదీన రఘునాథ్ నగర్ అగవిలో అడవి పందులను వేటాడటానికి పెట్టిన కరెంటు వైరుకు ఏనుగు బలైందని చెప్పారు అడవి అధికారులు. మరుసటి రోజు…  ఉచ్చులో ఏనుగు పడిందని తెలుసుకుని దాని దంతాలను తొలగించి ఓ తోటలో దాచినట్లు చెప్పారు. వాటిని అమ్మడానికి ప్రయత్నిస్తున్న క్రమంతో తాము పట్టుకున్నట్లు చెప్పారు అటవీశాఖ పోలీసులు. ఏనుగునుంచి తొలగించిన రెండు దంతాలు వరుసగా.. 15.90, 16.40 కిలోలు ఉన్నట్లు చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్ లో వీటి విలువ సుమారు 70లక్షల రూపాయలు  ఉండవచ్చని తెలిపారు.