2026 ఆర్థిక సంవత్సరంలో13,223 జాబ్స్ ఇచ్చిన బ్యాంకులు

2026 ఆర్థిక సంవత్సరంలో13,223 జాబ్స్ ఇచ్చిన బ్యాంకులు

న్యూఢిల్లీ:  దేశంలోని 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎనిమిది బ్యాంకులు 2026 ఆర్థిక సంవత్సరంలో 13,223 మందిని నియమించుకున్నాయి. దీంతో వీటి మొత్తం సిబ్బంది సంఖ్య 6.28 లక్షలు దాటింది. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్​బీఐ 8,905 ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా మొదటి స్థానంలో నిలిచింది.  

2025 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు ఉద్యోగుల సంఖ్య 6.15 లక్షలుగా ఉండేది. ఈ జాబితాలో ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ), ఇండియన్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉన్నాయి.