త్వరలో ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం కూల్తది: ఆదిత్య థాక్రే

త్వరలో ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం కూల్తది: ఆదిత్య థాక్రే

మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని శివసేన నేత ఆదిత్య థాక్రే తెలిపారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని..అందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. అకోలా జిల్లాలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆదిత్య థాక్రే.. ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని.. 2.5 లక్షల మంది యువత ఉపాధి అవకాశాలు కోల్పోయిందన్నారు. 

మహారాష్ట్రలో రాజ్యాంగ విరుద్దంగా షిండే ప్రభుత్వం నడుస్తోందని ఆదిత్య థాక్రే  ఆరోపించారు. అకాల వర్షాలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారని..వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. షిండే ప్రభుత్వం తీసుకునే చర్యలతో పరిశ్రమలు వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నాయన్నారు.