మహారాష్ట్రలో కొలువుదీరిన కొత్త సర్కారు

మహారాష్ట్రలో కొలువుదీరిన కొత్త సర్కారు

మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం డిప్యూటీ సీఎంగా బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణం చేశారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు బీజేపీ, శివసేన నేతలు పాల్గొన్నారు. ఏక్ నాథ్ను ప్రమాణ స్వీకారం కోసం వైదికపైకి పిలవగానే ఆయన అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

వాస్తవానికి ఈ రోజు ఏక్ నాథ్ షిండే ఒక్కరే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని ఫడ్నవీస్ ప్రకటించారు. అయితే చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చారు. మహా సర్కారులో భాగం కావాలని డిప్యూటీ సీఎం పదవి చేపట్టాలని బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవీస్ కు సూచించారు. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు సిద్ధమయ్యారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణం చేశారు.