మంత్రాల నెపంతో వృద్ధుడి హత్య 

మంత్రాల నెపంతో వృద్ధుడి హత్య 

మల్యాల, వెలుగు : జగిత్యాల జిల్లా మల్యాల మండలం గొర్రెగుండం విలేజ్ లో మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో ఆదివారం రాత్రి ఓ వృద్ధుడిని హత్య చేశారు. జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్​ కథనం ప్రకారం..గ్రామానికి చెందిన సుంకె దుబ్బయ్య (65), ఇదే ఊరికి చెందిన రేగుల మహేశ్‌‌‌‌ కలిసి తిరుగుతుంటారు. ఈ మధ్య మహేశ్ ​పిల్లలు జ్వరాలు, వాంతులతో బాధపడుతున్నారు. దీంతో దుబ్బయ్య మంత్రాలు చేయడం వల్లే తన పిల్లలు అనారోగ్యానికి గురయ్యారని మహేశ్ ​భావించాడు. ఊర్లో కూడా దుబ్బయ్య మంత్రాలు చేస్తాడనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి దుబ్బయ్య, మహేశ్ ఓ చోట​ లిక్కర్ ​తాగారు. మద్యం మత్తులో ఉన్న దుబ్బయ్యపై మహేశ్ ​వెపన్​తో దాడి చేసి చంపేశాడు. తర్వాత మల్యాల పీఎస్​కు వెళ్లి లొంగిపోయాడు. డీఎస్పీతో కలిసి సీఐ రమణ మూర్తి, ఎస్ఐ చిరంజీవి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.