- కాగజ్‌నగ్‌ర సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదుట బైఠాయింపు
కాగజ్‌నగర్, వెలుగు : ఆస్తిని తీసుకున్న కొడుకు తనను పట్టించుకోవడం లేదని, కనీసం ఇంట్లోకి కూడా రానివ్వడం లేదని ఓ వృద్ధురాలు కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగింది. వివరాల్లోకి వెళ్తే... కుమ్రంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం నజ్రూల్‌నగర్‌లోని ట్రాక్టర్ షెడ్ ఏరియాకు చెందిన సుశీల మహజీ వైద్యశాఖలో పనిచేసి రిటైర్ అయ్యారు. కాగజ్‌నగర్‌లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న తన కొడుకు బబ్లూ మహజీ తనను పట్టించుకోవడం లేదని, కనీసం అన్నం కూడా పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే విషయంపై సంవత్సర కాలంగా సబ్ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. దీంతో గురువారం పలువురు మహిళలతో కలిసి వచ్చి సబ్‌కలెక్టర్ ఆఫీస్ ఎదుట బైఠాయించారు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్దకు చేరుకొని వృద్ధురాలితో మాట్లాడారు. సమస్యను సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా దృష్టికి తీసుకెళ్లగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
