
- ఎన్నికల కోడ్ నేపథ్యంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుమతి లేదు
- కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, వెలుగు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో తక్షణమే స్థానిక సంస్థల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అథారిటీ, కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. సోమవారం కలెక్టరేట్మీటింగ్హాల్లో జిల్లా ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూలు నేపథ్యంలో ప్రభుత్వం ప్రజాప్రతినిధులకు ఇస్తున్న ప్రభుత్వ వాహనాలు నిలిపివేయాల్సి ఉంటుందన్నారు.
అధికారులు నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి కలెక్టర్ వరకు ఔట్సోర్సింగ్ సిబ్బంది, కాంట్రాక్టు ఉద్యోగులు ప్రతి ఒక్కరు ఎన్నికల కమిషన్ పరిధిలో మాత్రమే పనిచేస్తారన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ నాయకులతో కలిసి తిరగడం, పార్టీ ర్యాలీలో పాల్గొనడం, ఇతర రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కిందికి వస్తుందన్నారు. అలాంటి సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కోడ్ అమల్లోకి వచ్చిన ప్రాంతాల్లో వెంటనే రాజకీయ ప్రచారాలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు, గోడ రాతలు తొలగించాలని ఆదేశించారు.
మహబూబ్ నగర్ కలెక్టరేట్ : రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జడ్పీటీసీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని కలెక్టర్ విజయేందిరబోయి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని దృష్టిలో ఉంచుకొని కొత్తగా ఎలాంటి ప్రభుత్వ పథకాలు మంజూరు చేయడం, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం, గ్రౌండింగ్ వంటివి చేయకూడదని ఆమె తెలిపారు.