న్యూఢిల్లీ: ఎస్ఐఆర్పై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం చెలరేగుతున్న తరుణంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఓటర్ లిస్ట్ స్పెషల్ సమరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్) చేపట్టాలని గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో తొలగించిన పేర్లు, కొత్త ఓటర్లు, యువ ఓటర్లకు అవకాశం కల్పించడమే ఎస్ఎస్ఆర్ ప్రధాన ఉద్దేశం.
ఈ సవరణ జాబితాలో బెంగాల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, బిహార్, తమిళనాడు తదితర రాష్ట్రాలు ఉన్నాయి. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, హర్యానా, జార్ఖండ్, కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీ ఎస్ఐఆర్ కొనసాగుతున్న రాష్ట్రాల్లో ఎస్ఎస్ఆర్ షెడ్యూల్ తర్వాత ప్రకటిస్తారు.
