న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్కు ముంబై పోలీసులు షాక్ ఇచ్చారు. ఇటీవల ముంబైలో జరిగిన ఓ నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొనడం వివాదాస్పదమైంది. అమెరికా పౌరసత్వం కలిగి ఉండి ఇక్కడ నిరసనల్లో పాల్గొన్నందున.. ఇమ్మిగ్రేషన్ అధికారులు, ముంబై పోలీసులు, ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ లోని సెక్షన్ 7, ఇతర నిబంధనలను ప్రయోగిస్తూ ' లీవ్ ఇండియా' నోటీసును జారీ చేశారు. అక్టోబర్ 28 లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై స్పందించిన ఇమ్రాన్ఖాన్ పోలీసుల నోటీసులను సవాల్ చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు.
