Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక..అబ్జర్వర్లుగా ముగ్గురు ఐఏఎస్ అధికారులు

Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక..అబ్జర్వర్లుగా ముగ్గురు ఐఏఎస్ అధికారులు

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం ఎలక్షన్​ కమిషన్ ఆఫ్​ ఇండియా (ECI) అబ్జర్వర్లను నియమించింది.జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ఎటువంటి అవతకతవకలు జరగకుండా నిస్పాక్షికంగా, పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు ముగ్గురు సీనియర్ IAS అధికారులను పరిశీలకులుగా నియమించింది. 

ఉప ఎన్నిక సాధారణ పరిశీలకులుగా ఐఏఎస్ అధికారి రంజిత్ కుమార్ సింగ్, పోలీస్ పరిశీలకులుగా ఐపీఎస్ అధికారి ఓం ప్రకాశ్ త్రిపాఠి, అభ్యర్థుల ఖర్చుల పరిశీలకులుగా ఐఆర్ఎస్ అధికారి సంజీవ్ కుమార్ లాల్‌లను నియమించింది. ఈ అధికారులు ఎన్నికల ప్రక్రియలో సాధారణ పర్యవేక్షణ, శాంతి భద్రతల పర్యవేక్షణ, పార్టీలు, అభ్యర్థుల ఖర్చుల పర్యవేక్షణ వంటి అంశాలను పరిశీలకులు పర్యవేక్షిస్తారు. 

ఎన్నిక పూర్తి అయ్యేవరకూ ఎన్నికల నిబంధనల అమలు, శాంతి భద్రతలు, ఎన్నికల ఖర్చు పర్యవేక్షణ వంటి అంశాలను దగ్గరగా పర్యవేక్షిస్తారు. ఎన్నికలకు ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన‌లు, శాంతి భద్రతలు, వ్యయాలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులుంటే పరిశీలకులకు తెలియజేయవచ్చని ప్రజలకు, పార్టీలకు సూచించింది ఎన్నికల సంఘం.