తెలంగాణ ఎన్నికలపై ఈసీ సమీక్ష

తెలంగాణ ఎన్నికలపై ఈసీ సమీక్ష

నవంబర్ 30న తెలంగాణలో జరగనున్న ఎన్నికలపై  ఈసీ సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్షలో  సీఈవో వికాస్‌రాజ్‌, పోలీసు ఉన్నతాధికారులు  అన్ని జిల్లాల ఎన్నికల ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు.  ప్రలోభాల కట్టడి, పోలింగ్‌ రోజున తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. 

ఎన్నికల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తెలంగాణకు సెంట్రల్‌ ఫోర్స్‌ కూడా వచ్చేసింది.  సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అదనపు ఫోర్స్‌ను కేటాయించారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన ప్రచార ఘట్టం నేటితో ముగియనుంది. మంగళవారం సాయంత్రం 5 గంటలకే ప్రచారానికి తెర పడనుంది. ఈ నెల 30వ తేదీన పోలింగ్​ ఉన్నందున 48 గంటల ముందు నుంచే సైలెన్స్ పీరియడ్ మొదలు కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్​అమల్లోకి వస్తుంది. 

సంబంధిత నియోజకవర్గానికి చెందని వారంతా ఆయా నియోజకవర్గాల్లో ఉండరాదని ఎలక్షన్​ కమిషన్​ఇప్పటికే స్పష్టం చేసింది. దాంతో పలు పార్టీలు చివరి రోజున బహిరంగ సభలతో పాటు ర్యాలీలు, రోడ్​ షోలు, కార్నర్​ మీటింగ్​లు పెట్టనున్నారు.